
ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌తో అనుసంధానంపై ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తంది. దీనితో పోస్టల్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రాగలవని, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలతో పోస్టల్ విభాగం పోటీపడేందుకు వీలవుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో సమావేశమైన సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు ఈ విషయాలను వివరించారు.
ఇండియా పోస్ట్ ఐటీ 2.0 ఫ్రేమ్ వర్క్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. రియల్ టైమ్‌లో ట్రాక్ చేసేందుకు, డిజిటల్ చెల్లింపులు మొదలైన వాటికి ఉపయోగపడేలా ప్లాట్‌ఫాంను కొత్తగా అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. 86వేలకు పైగా పోస్టాఫీసులు కొత్త అప్లికేషన్ ను ఉపయోగిస్తున్నాయని, ఆగస్టు 4 నాటికి, సుమారు 1.65 లక్షల పోస్టాఫీసుల నెట్ వర్క్ మొత్తం కొత్త ప్లాట్ ఫామ్ కు మారుతుందని అధికారులు మంత్రికి తెలియజేశారు.