చిత్తూరు జిల్లా : 175 నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా నగరికి వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అడవికొట్టు రాజు బైక్ యాత్ర చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో బైక్ యాత్ర చేయడానికి సంకల్పించి గత ఏడాది డిసెంబరు 21న యాత్ర ప్రారంభించిన రాజు, బుధవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. బైక్‌పై వైఎస్ జగన్ చిత్రపటాలు ఉన్న ఫ్లెక్సీలతోను, వైఎస్సార్‌సీపీ జెండాతో ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న బైక్‌పై వస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. 97 రోజుల పర్యటన నిమిత్తం బయలుదేరానని జగనన్నపై ఉన్న అభిమానమే ఈ పర్యటనకు కారణమని అడవికొట్టు రాజు తెలిపారు.


