PaniPuri : ముంగిటకే ముస్తాబై వస్తోంది! | Attractive PaniPuri bike in janagam goes viral | Sakshi
Sakshi News home page

PaniPuri : ముంగిటకే ముస్తాబై వస్తోంది!

Jul 9 2025 11:55 AM | Updated on Jul 9 2025 2:01 PM

Attractive PaniPuri bike in janagam goes viral

బైక్‌కు పానీపూరి బండి ఏర్పాటు 

ఆకట్టుకుంటున్న మొబైల్‌ పానీపూరి వాహనం

పాలకుర్తి టౌన్‌ : సాధారణంగా పానీ పూరి బండి ఒక ప్రాంతంలో ఆ రహదారిపైనే కనిపిస్తుంది. లేదా షాపులో మాత్రమే ఉంటుంది. వినియోగదారులు అక్కడికెళ్లి మాత్రమే తినాల్సి ఉంటుంది. అయితే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. వినియోగదారులు వ్యాపారి వద్దకు కాకుండా వ్యాపారే వినియోగదారుడి వద్దకు వెళ్లేలా కొత్తగా ఆలోచించాడు. 

అనుకున్నదే తడువుగా బైక్‌ (మొబైల్‌ పానీ పూరి)కు పానీపూరి బండి అమర్చి నేరుగా వినియోగదారుల వద్దకే  వెళ్లి విక్రయిస్తున్నాడు. అతనే పాలకుర్తి మండలం టీఎస్‌కే తండాకు చెందిన బానోత్‌ రమేశ్‌. బైక్‌ను సగభాగం వరకు తొలగించి పానీపూరి డబ్బాను ఆల్ట్రేషన్‌ చేసి అందంగా  ముస్తాబు చేసి పాలకుర్తి మండల కేంద్రంలో విక్రయిస్తున్నాడు. దీంతో ఈ మొబైల్‌ పానీపూరి బండిని చూసిన వినియోగదారులు ఆలోచన..అదుర్స్‌ అంటూ కొనియాడుతున్నారు. బైక్‌కు రూ. 80వేలకు కొనుగోలు హైదరాబాద్‌లో పానీపూరి డబ్బాను ఆల్ట్రేషన్‌ చేసినట్లు రమేశ్‌ తెలిపారు. కాగా, రమేశ్‌ పానీపూరిని ముందస్తుగానే వివాహ, శుభకార్యాలకు భోజన ప్రియులు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి : ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement