పానీపూరి(గప్‌చుప్‌)... ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా! | Pani Puri Origin Mahabharata Story | Sakshi
Sakshi News home page

పానీపూరి(గప్‌చుప్‌)... ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా!

Oct 16 2026 11:19 AM | Updated on Oct 16 2026 11:32 AM

Pani Puri Origin Mahabharata Story

వంట కథలు

పానీపూరి పుట్టుక గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో అత్యంత ఆసక్తికరమైనది... మహాభారత కాలానికి చెందినది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న కాలంలో... కోడలు ద్రౌపది తెలివితేటలను రకరకాలుగా పరీక్షించేవారట కుంతీ.

ఆ పరీక్షలలో ఒకటి... బంగాళదుంప కూరలో మిగిలిన భాగాన్ని, గోధుమ పిండితో చేసిన చిన్న ముద్దను ఇచ్చి... ‘వీటితోనే అయిదుగురు అన్నదమ్ముల ఆకలి తీర్చు’ అని చెప్పిందట. ఈ నేపథ్యంలో ఒక సృజనాత్మక మార్గాన్ని కనిపెట్టింది ద్రౌపది. తనకు ఇచ్చిన తక్కువ పిండితో చపాతి చేయడానికి బదులుగా, చిన్న చిన్న భాగాలు చేసింది. పిండి ముక్కలను గుల్లగా మారేలా వేయించి, వాటిలో బంగాళదుంప మిశ్రమాన్ని నింపింది. అదే...పానీపూరి తొలిరూపం!

కోడలి సృజనాత్మకతను చూసి కుంతి ముగ్ధురాలైందట. ఆ సంతోషంలో కోడలు తయారుచేసిన వంటకానికి అమరత్వం ప్రసాదించిందట! ఆ వరం వల్లే ‘పానీపూరి’గా బాగా పాపులర్‌ అయిందట. బిహార్‌లోని ప్రాచీన మగధ ప్రాంతంలో ‘పానీపురి’ పుట్టిందని మరో కథనం.

ఇదీ చదవండి: జస్ట్‌ రూ.2 వేలుతో ప్రారంభించి..రూ. 580 కోట్ల బ్రాండ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement