బైక్‌పైనే ముద్దుముచ్చట | - | Sakshi
Sakshi News home page

బైక్‌పైనే ముద్దుముచ్చట

May 20 2024 9:30 AM | Updated on May 20 2024 10:26 AM

బైక్‌పై ముద్దుముచ్చట

బైక్‌పై ముద్దుముచ్చట

 పోకిరీ జంట వైరల్‌

దొడ్డబళ్లాపురం: సిలికాన్‌ సిటీలో కొందరు జంటలు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. అదే మాదిరిగా ఒక యువకుడు తన లవర్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని బైక్‌ నడిపిన వీడియో బయటకు వచ్చింది. యలహంక సమీపంలో ఎయిర్‌పోర్టు రోడ్డులో ఒక యువకుడు బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ మీద యువతిని కూర్చోబెట్టుకుని కేరింతలు కొడుతూ దూసుకెళ్లాడు.

ఇద్దరూ హెల్మెట్‌ కూడా ధరించలేదు. కొందరు పౌరులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పోకిరీ జంట నిర్వాకం వైరల్‌గా మారింది. మే 17న ఈ తతంగం జరిగినట్టు తెలుస్తోంది. ఆ జంటకు చీవాట్లు పెడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement