Telangana Crime News: ప్రాణం తీసిన స్పీడ్‌ బ్రేకర్‌..!
Sakshi News home page

ప్రాణం తీసిన స్పీడ్‌ బ్రేకర్‌..!

Published Sat, Sep 16 2023 12:40 AM

- - Sakshi

కరీంనగర్: రాత్రి సమయంలో బైక్‌ స్పీడ్‌ బ్రేకర్‌ పైనుంచి వెళ్లడంతో ఓ యువకుడు ఎగిరి బండరాయిపై పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట్‌కు చెందిన బోయిని అజయ్‌(27) శుక్రవారం ద్విచక్రవాహనంపై హుస్నాబాద్‌ వెళ్లాడు. రాత్రి 9.30 గంటల సమయంలో స్వగ్రామం వస్తున్నాడు.

గ్రామ క్రాసింగ్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ను గమనించకుండా వెళ్లడంతో ఎగిరి బండరాయిపై పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడికి తల్లి అనసూర్య, తండ్రి లక్ష్మయ్య, ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. అక్కకు వివాహం చేశారు. అజయ్‌ అవివాహితుడు కాగా హుస్నాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement