
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత టీవీఎస్ మోటార్ సంస్థ తన ప్రధాన మోటార్ సైకిల్ టీవీఎస్ అపాచీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అపాచీ ఆర్‌టీఆర్ 160, 180, 200, టీవీఎస్ అపాచీ RR310, RTR310 లైనప్‌లలో లిమిటెడ్–ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ లైనప్‌లో ప్రత్యేకమైన బ్లాక్–షాంపైన్–గోల్డ్ లివరీ, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, యూఎస్‌బీ చార్జర్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, 200 లైనప్‌లలో అత్యున్నత స్థానంలో నిలిచే కొత్త 4 వీ వేరియంట్లు, అత్యాధునిక క్లాస్–డి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎన్‌లు, ఆల్–ఎల్‌ఈడీ లైటింగ్, 5 అంగుళాల కనెక్టెడ్ టీఎఫ్‌టీ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బోల్డ్ కొత్త రంగులు, డైనమిక్ గ్రాఫిక్స్ తదితర అదనపు ఫీచర్లు లభించాయి. ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈవో కె.ఎన్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 6.5 మిలియన్ల టీవీఎస్ అపాచీ కమ్యూనిటీకి కృతజ్ఞతలు తెలిపారు.