
సాక్షి, కరీంనగర్: చెవులను రణగొణ ధ్వనులతో ఠారెత్తించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్స్‌ను కరీంనగర్ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్న బైక్స్‌ను పట్టుకున్నారు. ఆయా వాహనాలకు చెందిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. వారి కళ్లముందే రోడ్ రోలర్ తో సైలెన్సర్స్‌ను తొక్కించేసి.. తునాతునుకలుగా ధ్వంసం చేశారు.