
ఢిల్లీ: నగరంలో ఊహించని విషాదం జరిగింది. కల్కాజీ ప్రాంతంలో తండ్రి, కూతురు బైక్‌పై వెళ్తుండగా భారీ వర్షానికి బైక్‌పై చెట్టు కూలిపోయింది. తండ్రి మృతి చెందగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సుధీర్ కుమార్ (50) అనే వ్యక్తి తన కుమార్తె ప్రియ (22)తో కలిసి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఒక పాత వేప చెట్టు విరిగి బైకర్, పక్కనే ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటన ఉదయం 9:50 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ విషాద ఘటన రికార్డయ్యింది.
చెట్టు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పీసీఆర్ కాల్‌కు పోలీసులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు బాధితులను బయటకు తీసి, సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
In South Delhi’s Kalkaji, a biker lost his life after a tree collapsed on him during heavy rain.pic.twitter.com/58u0JEa4E4
— Greater Noida West (@GreaterNoidaW) August 14, 2025
తండ్రి, కుమార్తె ఇద్దరినీ AIIMS ట్రామా సెంటర్‌లో చేర్చారు. తండ్రి తీవ్ర గాయాలతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున నుండి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు ప్రభావంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనానికి అంతరాయం కలిగింది.