
సెల్ఫీలు దిగుతూ.. చీరలతో ఫోజులిస్తూ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ కర్నూలులో సందడి చేశారు.

ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మొట్టమొదటిసారి కర్నూలుకు విచ్చేసిన హీరోయిన్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

షాపింగ్ మాల్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై ఆమె స్టెప్పులు వేయడంతో యువత కేరింతలతో హోరెత్తించారు.




















