సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు(డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.
సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంచర్ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


