
కర్నూలు జిల్లా : తమ భూ వివాదానికి సంబంధించి తహశాల్దీర్ ఎదుట హాజరైన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమస్యను పరిషక్రించుకోవడానికి తహశీల్దార్ ఎదుట హాజరైన ఆ రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి పెద్దదైంది. దాంతో ఒకరిపై ఒకరరిపై దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటన మంత్రాలయం తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం వగరూరులో ఉన్న 80 సెంట్లు పొలం తగాదా ఘర్షణకు దారి తీసింది. దాంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పీఎస్‌కు తరలించారు.