
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా.
ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు.