
నంద్యాల: బీటెక్ చదవొద్దన్న భర్తపై భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై ఆదోని త్రీటౌన్ ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ఎంఐజీ కాలనీకి చెందిన వర్షితకు మేనత్త కొడుకు అయిన బనగానపల్లికి చెందిన ఓంప్రకాష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. సంతానం లేదు. వర్షిత హైదరాబాదులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వర్షితను చదువు మాన్పించేందుకు భర్త ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన వర్షిత ఆదోనిలోని పుట్టింటికి చేరుకుంది. ఘటనపై బుధవారం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా భార్యను చదివించేందుకు ఓంప్రకాష్ ఒప్పుకోలేదు. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఓంప్రకా‹Ùపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.