
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్ తెలిపారు. సోమవారం కర్నూలులోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జిల్లాలో ప్రధాని పర్యటనపై వీరు సమీక్ష చేపట్టారు.
3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సభ ఏర్పాటుకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను ఈ సందర్భంగా మంత్రులు గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు.