
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్‌గేట్ సమీపంలో ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పర్యటన ఇలా..
7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం
10.20 AM: కర్నూలు ఎయిర్‌పోర్ట్
10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్
11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక
11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం
12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక
1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి
1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
4.00 PM: బహిరంగ సభ
4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి
7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపు
కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..
రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.
రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.
రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.
రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.
రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.
రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.
రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.
గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.