
సాక్షి,కర్నూలు: అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్జ్యూమర్ కోర్టు షాకిచ్చింది. అమెజాన్ సంస్థపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఇటీవల ఓ వినియోగదారుడు రూ.80,000 చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ పెట్టాడు. బుదులుగా అమెజాన్ ఐక్యూ ఫోన్‌ను డెలివరీ చేసింది.దీంతో కంగుతిన్న బాధితుడు బాధితుడు కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోపోద్రికుడైన కష్టమర్ కర్నూలు జిల్లా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన కోర్టు.. అమెజాన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్‌కు ఐఫోన్ డెలివరీ చేయాలని, లేదంటే రూ.80వేలు రిఫండ్ చేయాలని సూచించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. అయితే, అమెజాన్ సంస్థ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది.