
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఉల్లి పంట రైతుకు కంటతడి పెట్టిస్తోంది. ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో పంటను రైతులు పొలంలోనే వదిలివేస్తున్నారు. పంట పండించినా ప్రయోజనం లేకపోగా భూమి చదును చేసేందుకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉల్లి పంటను గొర్రెలకు, మేకలకు రైతులు వదిలేస్తున్నారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి ఉల్లి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకు పోయమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి కొచ్చిన పంటను వదిలేసి.. రైతు విశ్వనాథ్ ట్రాక్టర్‌తో దున్ని వేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తు కష్టమేనని రైతులు అంటున్నారు.