
సాక్షి, కర్నూలు: టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడులో పచ్చనేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. గురువారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ మినీ మహా నాడులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఈ ప్రభాకర్ ఫైరయ్యారు.
కర్నూలు జిల్లా మినీ మహా నాడు కార్యక్రమంలో సభను ఉద్దేశించి మంత్రి టీజీ భరత్‌పై విమర్శలు గుప్పించారు. మహా నాడు సభకు కూడా హాజరు కాలేనంత బిజీ బిజీగా మంత్రి టీజీ భరత్ ఉన్నారని మండిపడ్డారు.
పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు , కార్యకర్తలకు న్యాయం జరగాలి లేదంటే నేను ఊరు కోను ముఖ్యమంత్రే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఎందుకు దక్కించులేదనే ప్రశ్నకు మంత్రి దగ్గరే సమాధానం లేదని చురకలంటించారు. ఒకటి, రెండు నెలలు చూసి పార్టీ బలోపేతానికి తాను రంగంలోకి దిగుతాను అంటూ కేఈ ప్రభాకర్ హెచ్చరించారు.