కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా | Telangana CM Revanth Reddy Inquires About Kurnool Private Travels Bus Accident, More Details Inside | Sakshi
Sakshi News home page

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా

Oct 24 2025 9:53 AM | Updated on Oct 24 2025 11:41 AM

Telangana Cm Revanth Inquires About Kurnool Bus Accident Incident

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎస్​ రామకృష్ణారావు, డీజీపీ శివధర్​రెడ్డిలతో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. తక్షణమే  ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్​ లైన్​ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు  జెన్​కో సీఎండీ హరీష్​ను వెంటనే  ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్‌ లైన్‌ ఏర్పాటు చేసింది
ఎం.శ్రీరామచంద్ర- అసిస్టెంట్‌ సెక్రటరీ-991291954
ఈ.చిట్టిబాబు-సెక్షన్‌ ఆఫీసర్‌-9440854433
గద్వాల్ కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం నంబర్‌-9502271122
కలెక్టరేట్‌లోని హెల్ప్ డెస్క్‌ నంబర్‌ 9100901599- 9100901598
కర్నూల్  ప్రభుత్వ  జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూం నంబర్‌ 9100901604
గద్వాల్  పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828
బాధిత కుటుంబాలు.. ఈ నంబర్లకు  ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement