breaking news
Bus Accident incident
-
తిరుపతి జిల్లా: పూడి క్రాస్ వద్ద ఆర్టీసి బస్సు బోల్తా
-
కాలువలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
కాలువలోకి దూసుకెళ్లిన కావేరి బస్సు
సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్ ప్లేట్ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
కరకట్టపై బస్సు ప్రమాదం; ఎమ్మెల్యే సహాయం
సాక్షి, విజయవాడ : డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం ఉంగరాల కట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే సుమారు 60 మంది ప్రయాణీకులతో విజయవాడ నుండి ఆవనిగడ్డ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు ఉంగరాల కట్ట మూల మలుపు వద్ద బోల్తా పడి పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అదే దారిలో ప్రయాణీస్తున్న ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విషయం తెలుసుకొని ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసి, అంబులెన్స్‌ను పిలిపించి దగ్గరుండి బాధితులను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. కాగా, బస్సును వేగంగా మలుపు తిప్పడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు చెబుతున్నారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం..
-
జగన్‌పై నందిగామ కేసును ఇంకా బిగిద్దాం
సాక్షి, అమరావతి: నందిగామ వ్యవహారంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై బనాయించిన కేసును ఇంకా బిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎక్కువసేపు ఈ ఘటనపైనే చర్చించినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలనే దానిపైనే ఎక్కువసేపు మంత్రులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ ఘటనను మంత్రివర్గం తీవ్రంగా ఖండించాలని చంద్రబాబు సూచించడంతో ఆ మేరకు ఒక తీర్మానం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్వహించిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనర్హత కొనసాగించాలనే పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఆంధ్రావని నడి వీధుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి నెట్వర్క్ అత్యంత దుర్మార్గం.. హేయం.. ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే సహించలేకపోతోంది. బాధ్యతను గుర్తుచేస్తే భరించలేకపోతోంది. బాధితులను ఆదుకోమని అడిగితే కోపగిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడివీధిలో ఖూనీ చేయడానికి వెనుకాడడం లేదు. కృష్ణాజిల్లా బస్సుప్రమాద ఘటనలో అధికారులు చేస్తున్న పొరపాట్లను అడ్డుకోబోయిన ప్రతిపక్షనేతపై కేసు మోపారు... అదేం అన్యాయమంటూ రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ఉక్కుపాదంతో అణచేశారు. విజయవాడలో మాజీ శాసనసభ్యుడు, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ను, మిగిలిన నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకుని రోజంతా విజయవాడకు దూరంగా ఓ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. అసలు అక్కడ ధర్నా ప్రారంభం కాలేదు. ఉద్రిక్తత లేదు. కానీ పోలీసులు మాత్రం కక్షగట్టినట్లు నేతలను అక్రమంగా నిర్బంధించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. చివరకు వెల్లంపల్లి ఎస్ఐపై దౌర్జన్యం చేశారంటూ ఓ తప్పుడు కేసు పెట్టారు. గురువారం రాష్ట్రవ్యాపితంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై జులుం ప్రదర్శించారు. ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగి అనేకమంది చనిపోయినపుడు బాధితులకు న్యాయం జరగాలని, దోషులకు శిక్ష పడాలని ఎవరైనా ఆశిస్తారు. ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు సరిగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తారు.. కానీ దోషులను రక్షించేలా, బాధితులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తుంటే.. అదేమిటంటూ నిలదీసిన ప్రతిపక్షనేతపైనే కేసు నమోదు చేయడం, దానికి నిరసన తెలుపుతూ ప్రజలు ప్రదర్శనలకు దిగితే అణచివేయాలని చూడడం టీడీపీ ప్రభుత్వ హద్దులు లేని అసహనానికి నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడలో వైఎస్సార్సీపీ నేతల అక్రమనిర్బంధం విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం స్థానిక ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా ప్రారంభానికి ముందే నాయకులను అరెస్టుచేసి బలవంతంగా ఓ మినీ లారీలోకి ఎక్కించారు. టాప్లేని, కూర్చోవడానికి వీలులేని లారీలో ఎండలోనే సుమారు 60కి.మీ దూరంలో ఉన్న ఉంగుటూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసినవారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తదితరులున్నారు. వారిని కృష్ణాజిల్లా ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉంచి వేధించారు. పై అధికారుల ఆదేశాల మేరకే ఇక్కడకు తీసుకువచ్చారని, తమ స్టేషన్లో ఉంచుకోవడం తప్ప తమకు ఇతర సమాచారం తెలియదంటూ ఉంగుటూరు పోలీసులు పేర్కొన్నారు. అక్రమంగా నిర్బంధించడంపై పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగేందుకు సిద్దం కాగా, రాత్రి 10.45గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారు. కాగా, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన వత్తిడి మేరకు.. ఉంగుటూరు పోలీసుస్టేషన్లో ఉన్న నాయకుల్లోంచి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వేరు చేసి ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లలతో కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. వెల్లంపల్లి మినహా మిగిలిన నేతలు వెళ్లిపోవచ్చని సూచించారు. పోలీసుల ఎత్తుగడను ముందుగానే ఊహించిన పార్టీ నేతలు ఒక్కరిపైనే కేసు నమోదు చేస్తామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్‌తో సహా అందరు నేతల్ని రాత్రికి విజయవాడ తీసుకువచ్చారు. ఎస్ఐ విధులు నిర్వహించకుండా ఆటంకపరచడమే కాకుండా ఎస్ఐపై దౌర్జన్యం చే శారంటూ వెల్లంపలిపై ఐపీసీ 353 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ పై వదిలిపెట్టారు.