కరకట్టపై బస్సు ప్రమాదం; ఎమ్మెల్యే సహాయం | Bus Accident; MLA Simhadri Ramesh Helped | Sakshi
Sakshi News home page

కరకట్టపై బస్సు ప్రమాదం; ఎమ్మెల్యే సహాయం

Aug 31 2019 8:59 PM | Updated on Aug 31 2019 9:01 PM

Bus Accident;  MLA Simhadri Ramesh Helped - Sakshi

సాక్షి, విజయవాడ : డ్రైవర్‌ నిర్లక్ష్యంతో బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం ఉంగరాల కట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే సుమారు 60 మంది ప్రయాణీకులతో విజయవాడ నుండి ఆవనిగడ్డ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఉంగరాల కట్ట మూల మలుపు వద్ద బోల్తా పడి పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అదే దారిలో ప్రయాణీస్తున్న ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు విషయం తెలుసుకొని ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేసి, అంబులెన్స్‌ను పిలిపించి దగ్గరుండి బాధితులను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. కాగా, బస్సును వేగంగా మలుపు తిప్పడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement