
కృష్ణాజిల్లా : కృష్ణా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబ తీవ్రంగా ఖండించారు. ఎక్కడా ఎవరి గురించి కూడా పొరపాటుగా మాట్లాడని హారిక కారుపై దాడి చేయడమే కాకుండా ఆమెపై అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఆమె కారు పగలగొట్టి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారంటూ సింహాద్రి రమేస్ బాబు మండిపడ్డారు.
‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తయారుచేసిన మేనిఫెస్టోని ప్రజల మధ్యకు మేము తీసుకువెళ్తున్నాం. 13 నెలల్లోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కడప వెళ్లి మీసం మెలేసి తొడగొట్టాడు. కొంతకాలం తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పం వెళ్లినప్పుడు తొడగొట్టమంటూ కేకలు వేశారు. కొట్టవలసింది తొడలు కాదు ప్రజలకు ప్రేమను పంచాలని వైఎస్సార్ ఫ్లయింగ్ కిస్ పెట్టాడు
ఉప్పాల హారిక మీద దాడి చేసినంత మాత్రాన మేం భయపడి పారిపోతామా?,్రజలకు వ్యతిరేకంగా పనులు చేస్తే నాశనం తప్పదు. రాజధానిలో ఆర్థిక సంపన్నులక ఉపయోగపడే పనులు మీరు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే పనులు మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేశారు. వైఎస్సార్‌సీపీ వాళ్లను బూతులు తిడుతూ బట్టలూడదీసి కొడతానని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మీకు కనబడలేదా?, జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
జగన్ వస్తున్నారంటే కొండలు, గుట్టలు, చేలు జనసంద్రమవుతున్నాయి. ఎన్ని బారికేడ్డు అడ్డుపెట్టినా జగన్ పర్యటనలకు వేలాదిగా జనం వస్తున్నారు. మీరు చేసే పాపిష్టి పనులు కొనసాగితే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఉప్పాల హారికను గుడివాడ వెళ్తుంటే మీరు ఆపి దాడికి పాల్పడ్డారు. మీ మంత్రులు ఇక్కడికి వస్తే మేము ఆపలేమా?, మీరు చేసే పనులతో తిరుగుబాటు రాదని అనుకుంటున్నారా? కూటమి నేతల్ని రమేస్‌బాబు హెచ్చరించారు.