breaking news
Uppala Harika
-
వీడియో సహా అన్ని ఆధారాలున్నాయి.. రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేవలం రెడ్‌బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం అని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ సైటెరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ప్పాల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై కేసు నమోదు చేయడం దారుణందాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త ఏం చేశారో.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. టీడీపీ మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆమె కొడాలి నాని.. ఫ్లెక్సీని చించేశారు. ఫ్లెక్సీని చించి చేతికి గాయం అయితే కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం.చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. నారా లోకేశ్ డైరెక్షన్‌తో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు పంపింది టీడీపీ కార్యకర్తలు కాదా?. జెడ్పీ చైర్పర్సన్ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా?. వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కేసులు పెడుతున్నారు. 13 నెలలుగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టీడీపీ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు. -
కొల్లు రవీంద్ర ను ఏకిపారేసిన YSRCP మహిళా లీడర్లు
-
టీడీపీ కార్యకర్త డ్రామా.. ఉప్పాల హారిక భర్తపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై గుడివాడ పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ నాయకురాలి ఫిర్యాదుతో ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి తర్వాత కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో, రంగంలోకి కూటమి పెద్దలు.. బాధితులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కొత్త డ్రామాకు, డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు.తాజాగా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి రివర్స్‌లో వారిపైనే కేసు పెట్టారు. పచ్చ బ్యాచ్ ప్లాన్‌లో భాగంగా హారిక భర్త రాము.. తన కాలుపై కారు ఎక్కించాడని టీడీపీ నాయకురాలు మాదాల సునీత ఆరోపించారు. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతల సాయంతో సునీత.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాముతో సహా నందివాడ మండలం వైఎస్సార్సీపీ నేత కందుల నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు. అయితే, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి ఘటనలో మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
నీకు సిగ్గుందా.. కొల్లు రవీంద్ర.. అన్నం తింటున్నావా లేక.. ఉప్పాల హారిక భావోద్వేగం
-
పథకం ప్రకారమే బీ‘పచ్చ’ కాండ
సాక్షి ప్రతినిధి, విజయవాడ : బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ సైకోలు హత్యాయత్నానికి పాల్పడినా పోలీసులు కనీసం స్పందించడంలేదు. దాడిని అడ్డుకోకపోగా.. నిందితులను గుర్తించి కనీసం కేసు నమోదు చేయలేదు. పాలకవర్గ సేవకే భక్షక భటవర్గం పరిమితమైదన్న విమర్శలను నిజం చేశారు. గుడివాడలో జరగాల్సిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు యత్నించారు. వివాదాస్పద పోస్టర్లతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను రాకుండా అడ్డుకొనే యత్నం చేశారు. సభకు వచ్చే మార్గాల్లో ముందుగానే టీడీపీ కిరాయి గూండాలు, గంజాయి, మద్యం తాగి కాపు కాసి వీరంగం సృష్టించారు. ఇందులో భాగంగానే సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న బీసీ మహిళ, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై గుడివాడ నాగవరప్పాడు వద్ద దాడికి తెగబడ్డారు.కారు అద్దాలు పగలగొట్టి, మారణాయుధాలతో హతమార్చేందుకు యత్నించారు. రాయలేని భాషలో జిల్లా ప్రథమ మహిళపై బండబూతులతో రెచి్చపోయారు. హారిక దంపతులు గంటన్నరకుపైగా కారులోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. టీడీపీ నాయకులు, కిరాయి గూండాలు గంజాయి, మద్యం సేవించి వచ్చి దాడికి కుట్ర పన్నినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్ష పాత్ర వహించారే తప్ప, కనీసం పచ్చ గూండాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మాత్రం అటువైపు రాకుండా భారీ బందోబస్తుతో నిలువరించారు. గుడివాడలో దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. దీనిని బట్టి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కనుసన్నల్లో దాడి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తొలుత పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని, లేకపోతే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులకు ఉచిత సలహా ఇచ్చారు. దాడి జరిగిన ప్రాంతంలో ఫిర్యాదు తీసుకోకపోతే ఎలాగని జెడ్పీ చైర్పర్సన్ దంపతులు నిలదీయటంతో చివరకు పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. భగ్గుమన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గుడివాడలో ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మహిళా నేతలు భగ్గుమన్నారు. జెడ్పీటీసీలు సభ్యులు, ఎంపీపీలు పెడన మండలం కోడూరులోని ఉప్పాల హారిక స్వగృహంలో ఆమెను కలిసి దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం మచిలీపట్నంలో కృష్ణాజిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందచేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక స్వగృహానికి పార్టీ నాయకులూ వెళ్లి ధైర్యం చెప్పారు. శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, గుడివాడ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చి ఉప్పాల హారికకు సంఘిభావం తెలిపి పరామర్శించి ధైర్యం చెప్పారు. తరలివచ్చిన మహిళా నేతలు ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ హోం మంత్రి తానేటి వనిత, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్షి్మ, చిటికిన వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు శీలం భారతి, విజయవాడ డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గతోపాటు పలు మహిళా సంఘాల నేతలు ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఆమెను పరామర్శించారు. నిందితులపై చర్యలేవీ? దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంత వరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటే పోలీసులు ఏ విధంగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే దాడి చేసిన వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు అధికార పార్టీ నాయకులు స్టేటస్‌లుగా పెట్టుకుని ఆనంద పడుతున్నా కనీసం పోలీసులు వాటి గురించి ఆరా తీయకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, గూండాలు, రౌడీలను తప్పించేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నట్టు సమాచారం. అమాయకులను ఇందులో ఇరికించే యత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిలో తెలుగు యువత నేత గోవాడ శివ ఉన్నట్టు వీడియోలు ఉన్నా.. పోలీసులు చర్యలకు వెనుకాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కరువు∙జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన జెడ్పీటీసీ సభ్యులు ∙జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మహిళ అని కూడా చూడకుండా హారికపై హత్యాయత్నాకి పాల్పడిన టీడీపీ, జనసేన గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు ఆమె భర్త రాముపై దాడికి పాల్పడ్డ నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ఎస్పీ గంగాధరరావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి నేతలు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. జరిగిన దాడిపై ఉప్పాల రాము గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాఇ కళ్యాణి, కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
‘డీజీపీ పచ్చచొక్కా వేసుకుని పనిచేస్తున్నారు’
గుంటూరు: కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌ల ప్రోత్సాహంతోనే టీడీపీ సైకోలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర డీజీపీ పచ్చచొక్కా వేసుకుని ఏకపక్షంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనంపై ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రబాబు మోసాలను ప్రశ్నించాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ప్రస్తుతం రెండో దశలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనిలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇదే క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించాం. అయితే ఈ సమావేశానికి రానివ్వకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్యపై బందరు వదిలి రాకూడదంటూ నిర్బంధాలు అమలు చేశారు. బీసీ నాయకురాలు, కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలు ఉప్పాల హారిక గుడివాడకు చేరుకుంటే, ఆమె కారుపై తెలుగుదేశం, జనసేన గుండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. కారు అద్దాలు పగులకొట్టారు, ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇది చూస్తుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారుఒక జిల్లా పరిషత్ చైర్మన్‌కే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా.? కర్రలు, రాళ్ళుతో టీడీపీ గూండాలు చేసిన దాడికి గంటసేపు అదే కారులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక మహిళా నేత ఉండాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. చివరికి ఆమె తెగించి, అక్కడే ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులను ఇదేనా మీరు చేస్తున్న శాంతిభద్రతల బాధ్యత అని ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా పోలీసులు 'వారంతా తాగి వచ్చారు, అల్లరి చేస్తున్నారు, మేం మాత్రం ఏం చేస్తాం' అంటూ మాట్లాడటం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఇంతగా పతనమైందా అనే అనుకోవాల్సి వస్తోంది. పోలీసులు ఏం మాట్లాడారో మొత్తం సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. అసాంఘిక శక్తులను అదుపు చేసే సామర్థ్యం పోలీసులకు లేదా? దాడి చేస్తున్న గుండాలను అరెస్ట్ చేయరా? మద్యం, గంజాయి మత్తులో దాడులు చేస్తే, మౌనంగా పోలీసులు నిలబడిపోయారు. ఒక బీసీ మహిళపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతుంటే, రక్షణ కల్పించలేని అసమర్థతతో వ్యవస్థను నడుపుతున్నారా.? వైఎస్సార్సీపీపై పోలీసులను ప్రయోగించడం, మా కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించడానికే పోలీసులను పరిమితం చేశారా? పెడనలో జరిగిన 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పేర్ని నాని వెళ్ళకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక కళ్యాణ మంటపంలో నాలుగు గోడల మధ్య నడిచే మీటింగ్‌లకు కూడా ఆంక్షలు పెడతారా.? చంద్రబాబు, లోకేష్, హోంమంత్రిల ప్రోత్సాహంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద ఇలాగే దాడి చేశారు. ఇంత వరకు దోషులపై కేసు పెట్టలేదు. ఉప్పాల హారికపై దాడి చేసిన వారిపైనా ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. వారిపై పోలీసులు కేసు పెడతామంటే మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు అంగీకరించరు. డీజీపీ పచ్చ చొక్కా వేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న ఇటువంటి దాడులపై కనీసం కేసులు కూడా పెట్టడం లేదు. ఏకపక్షంగా పనిచేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. -
‘హారిక మీద జరిగిన దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి’
పెడన: కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గుండాలు చేసిన దాడికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలిన వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ దాడి నేపథ్యంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలు, మాజీ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మితో పాటు పలువురు పెడనలో ఉప్పాల హారిక నివాసంలో ఆమెను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుడివాడలో పోలీసుల సమక్షంలోనే ఒక మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై పాశవికంగా దాడి జరిగిందంటే, ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల మద్దతు లేకుండా టీడీపీ గూండాలు ఇంతటి ఘాతుకానికి పాల్పడతారా అని నిలదీశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో ఒక అరాచక పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా వారేమన్నారంటే...దాడికి పాల్పడిన వారికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం: తానేటి వనితగుడివాడలో జరిగే "బాబు ష్యూరిటీ -మోసం గ్యారెంటీ" పార్టీ కార్యక్రమానికి వస్తుండగా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారు మీద తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన గూండాలు, రౌడీలు దాడి చేసి, భీభత్సం సృష్టించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన నాయకుల డైరెక్షన్లో అచారక శక్తులు దాడులు చేస్తున్నట్టు స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నా ఇప్పటివరకు ఎవరి మీదా కేసులు నమోదు చేయలేదు. పైగా దాడి చేసిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఆ గూండాలను అదుపుచేసే ప్రయత్నం చేయకుండా మా నాయకురాలినే నిలువరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దాడులు చేసినా పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరనే ధీమాతో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి సంస్కృతి ఎంతమాత్రం మంచిది కాదు. మా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే టీడీపీ, జనసేన నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడినా వారికి మీడియా ముఖంగానే సమాధానం చెప్పామే తప్ప, అధికారం చేతిలో ఉంది కదా అని భౌతిక దాడులకు ప్రయత్నించలేదు. కానీ ఈరోజు కూటమి పార్టీలు శృతిమించి వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటికీ భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు. హారిక మీద దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తూ జిల్లా మంత్రి ఆమెది నటన అని చులకన చేసి మాట్లాడటం సిగ్గు చేటు. గుడివాడ పీఎస్‌లో కేసు పెట్టడానికి వెళితే పెడనకి వెళ్లాలని వారికి సూచించారంటే కేసు నమోదు చేసే ధైర్యం కూడా పోలీసులకు లేదనిపిస్తుంది? జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న మహిళకు రక్షణ కల్పించడంలో విఫలమైనందుకు సిగ్గుపడకుండా గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం ఆయనకే సిగ్గుచేటు. బీసీ వర్గానికి చెందిన మహిళ ప్రజాప్రతినిధి మీద దాడి జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీ, మహిళా కమిషన్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం. ఇలాంటి దాడులు ఇంకెప్పుడూ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం, డీజీపీ, హోంమంత్రి, మీద ఉంటుంది. హారిక కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. వారికి సంఘీభావం తెలియజేయడానికి మా నాయకులు వైయస్ జగన్ ఆదేశాలతో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలి. మహిళా రక్షణపై సీఎం, డిప్యూటీ సీఎంల మాటలు పచ్చి అబద్దాలే : వరుదు కళ్యాణిజిల్లాకు ప్రథమ పౌరురాలైన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లా ప్రథమ పౌరురాలి మీద టీడీపీ, జనసేన సైకోలు, గూండాలు దాడి చేస్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత నుంచి ఖండిస్తూ కనీస ప్రకటన కూడా లేకపోవడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. పక్క రాష్ట్రంలో ఒక ఛానెల్ మీద దాడి జరిగితే యుద్ధ ప్రాతిపదికన వరుసగా ఖండిస్తూ ట్వీట్ చేసిన వీరంతా సొంత రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా ప్రతినిధి మీద దాడి జరిగితే చూస్తూ ఊరుకోవడాన్ని ఏమనాలి.? ఆడ బిడ్డ మీద దాడి చేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని ఒకరు, తలలు తీసేసే చట్టాలు తీసుకొస్తామని ఇంకొకరు మైకుల ముందర చేసిన శపథాలన్నీ ఏమయ్యాయి. అవన్నీ మాటలకే పరిమితమా.? బీసీ మహిళ ఉప్పాల హారిక కారు మీద రాళ్లు, కర్రలు, రాడ్లు తీసుకొచ్చి దాడి చేసి అద్దాలు పగలగొట్టి దంపతులను చంపాలని చూస్తే కనీసం సీఎంగా, డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా అయినా బాధ్యత తీసుకోరా.? ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారనే కారణంతో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలను అర్థరాత్రి అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. కానీ మా పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరిగితే మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆదేశాలతోనే దాడి జరిగిందనే మా అనుమానలు నిజమవుతున్నాయి. పాకిస్థాన్ ఐసిస్ ఉగ్రవాదుల్ని తయారుచేసినట్టు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్మాదులను తయారు చేసి మహిళల మీద దాడులకు వాడుకుంటున్నారు. ఇలాంటి దాడులతో టీడీపీ చివరికి తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిపోయింది. ఇప్పటికైనా ఒక మహిళగా అయినా హోంమంత్రి స్పందించి నిందితులపై కఠినంగా శిక్షించాలి.రెడ్‌బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ లేదు :రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర మేయర్బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్నా ఆమె మీద ఎలా దాడి జరిగిందో పోలీసులు, హోంమంత్రి వివరణ ఇవ్వాలి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన గూండాలు పార్టీ జెండాలు చేత్తో పట్టుకొచ్చి మరీ రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోంది. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగంతో మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీసీ మహిళగా ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా’అని పేర్కొన్నారు. -
‘మీరు చేసే పనులకు తిరుగుబాటు తప్పదు’
కృష్ణాజిల్లా : కృష్ణా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబ తీవ్రంగా ఖండించారు. ఎక్కడా ఎవరి గురించి కూడా పొరపాటుగా మాట్లాడని హారిక కారుపై దాడి చేయడమే కాకుండా ఆమెపై అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఆమె కారు పగలగొట్టి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారంటూ సింహాద్రి రమేస్ బాబు మండిపడ్డారు. ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తయారుచేసిన మేనిఫెస్టోని ప్రజల మధ్యకు మేము తీసుకువెళ్తున్నాం. 13 నెలల్లోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కడప వెళ్లి మీసం మెలేసి తొడగొట్టాడు. కొంతకాలం తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పం వెళ్లినప్పుడు తొడగొట్టమంటూ కేకలు వేశారు. కొట్టవలసింది తొడలు కాదు ప్రజలకు ప్రేమను పంచాలని వైఎస్సార్ ఫ్లయింగ్ కిస్ పెట్టాడుఉప్పాల హారిక మీద దాడి చేసినంత మాత్రాన మేం భయపడి పారిపోతామా?,్రజలకు వ్యతిరేకంగా పనులు చేస్తే నాశనం తప్పదు. రాజధానిలో ఆర్థిక సంపన్నులక ఉపయోగపడే పనులు మీరు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే పనులు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. వైఎస్సార్సీపీ వాళ్లను బూతులు తిడుతూ బట్టలూడదీసి కొడతానని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మీకు కనబడలేదా?, జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ వస్తున్నారంటే కొండలు, గుట్టలు, చేలు జనసంద్రమవుతున్నాయి. ఎన్ని బారికేడ్డు అడ్డుపెట్టినా జగన్ పర్యటనలకు వేలాదిగా జనం వస్తున్నారు. మీరు చేసే పాపిష్టి పనులు కొనసాగితే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఉప్పాల హారికను గుడివాడ వెళ్తుంటే మీరు ఆపి దాడికి పాల్పడ్డారు. మీ మంత్రులు ఇక్కడికి వస్తే మేము ఆపలేమా?, మీరు చేసే పనులతో తిరుగుబాటు రాదని అనుకుంటున్నారా? కూటమి నేతల్ని రమేస్బాబు హెచ్చరించారు. -
మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. మహిళల మీద మీ దాడి మీ శాడిజంకు పరాకాష్ట’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశారని బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీ వాళ్లను పంపి దాడులు చేయించారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘మహిళల మీద ఈ రోజు మీ దాడి, మీ శాడిజంకు పరాకాష్ట. వైఎస్సార్సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు.. చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని.. చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెబితే అలా వింటున్నారు కదా అని, మీ పచ్చ సైకోలతో మీరు దాడులు చేయించడం గొప్ప పనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు? పైగా పోలీసుల సమక్షంలోనే వారు దుర్భాషలాడుతూ దాడి చేశారు.చంద్రబాబూ.. దీన్ని పరిపాలన అనరు. శాడిజం అంటారు.. పైశాచికత్వం అంటారు. ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లను ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అని కూడా చూడకుండా, దుర్భాషలాడుతూ సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు. ఇది పైశాచికత్వం కాదా? అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో మీరు ఇలాగే చేస్తున్నారు. తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా మీరు వెళ్లనీయడం లేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన ప్రసన్న మీదే ఎదురు కేసు పెట్టారు. దాడి చేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే కానీ, వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు.. అరెస్టులు లేవు. ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కక్షలతో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొస్తారా? చంద్రబాబూ.. మీరు రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టారు. వీళ్లే కాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతో మంది అమాయకులను కేసుల్లో ఇరికించారు.. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.వైఎస్సార్సీపీకి చెందిన వందల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులపైన, వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టి వారిని హింసించారు.. తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచి్చన తర్వాత, ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవు. అవి మారినప్పుడు, మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా శాడిజం వదిలి, ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన గూండాలు కలిసి జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి తెస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు? పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన ఇది. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట కూటమి అధికారం చేపట్టాక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. కూటమి రెడ్‌బుక్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంహారికపై టీడీపీ గూండాల దాడి హేయం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు గుడివాడలో దాడికి పాల్పడటం హేయమైన చర్య. మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా? ఇటువంటి అమానుష దాడులను సహించేది లేదు. – జోగి రమేష్, మాజీ మంత్రిరాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళా ప్రజాప్రతినిధులను సైతం మానసికంగా వేధించడమే కాకుండా భౌతికంగా దాడులకు కూడా బరితెగించడం అన్యాయం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఈ రకమైన దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ ఆటవిక పాలన సాగుతోంది రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనలా మారింది. జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై దాడి హేయం. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే.. అదే చివరి రోజవుతుందన్న చంద్రబాబు టీడీపీ గూండాలు రెచి్చపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి పోలీసులు చోద్యం చూస్తున్నారు మహిళా ప్రజాప్రతినిధి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడి చేయడం దారుణం. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడం అంటే.. ఆ హోం మంత్రి పదవిలో ఉండటం అనవసరం. పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి రాష్ట్రంలో సైకోపాలన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సైకో పాలన నడుస్తోంది. గుడివాడలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల మాటున పచ్చ సైకోలు బీసీ కులానికి చెందిన, ఉన్నత చదువులు చదువుకుని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిలో ఉన్న ఉప్పాల హారికపై దాడికి తెగబడటం దారుణం. ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారు. – పేర్ని నాని, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడుదారుణమైన పాలన చంద్రబాబు ప్రజలకిచి్చన వాగ్దానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – విడదల రజిని, మాజీ మంత్రి పోలీసుల సాక్షిగా ఉన్మాద దాడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు? ఈ దాడికి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు? మహిళా హోం మంత్రి అనిత ఎందుకు నోరు మెదపడం లేదు? – ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి రాష్ట్రంలో రాక్షస పాలన సీఎం చంద్రబాబు రాక్షస పాలనలో వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు కర్రలు, రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేస్తోంది. బీసీ మహిళపై చేసిన దాడిని కచి్చతంగా గుర్తు పెట్టుకుంటాం. గంటన్నరసేపు మీటింగ్‌కు రానివ్వకుండా రోడ్డుమీద ఆపేసి, కారు అద్దాలు పగులగొట్టడం అమానుష చర్య. జిల్లా ప్రథమ పౌరురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? – ఆరె శ్యామల, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిమహిళ దుస్థితికి ఈ ఘటన అద్దం పట్టింది కూటమి పాలనలో మహిళల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మహిళలపై దారుణాలకు కూటమి నేతలు తెగబడుతున్నారు. ఈ దాడికి కూటమి కార్యకర్తలను ఎగదోసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను బీసీ వర్గాలు క్షమించవు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. – రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్ -
ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై 'టీడీపీ గూండాయిజం'
గుడివాడ రూరల్/గుడివాడ టౌన్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్‌రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై రివాల్వర్ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్‌పర్సన్, అమె భర్త, వైఎస్సార్సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఉప్పాల హారికతో ఫోన్లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్‌ను అడ్డుకుని వీరంగంగుడివాడలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్టరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది. -
ఏపీలో నారా సైకో పాలన సాగుతోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా?. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మీ అరాచకాలన్నీ గుర్తు పెట్టుకుంటాం.ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది.విడదల రజిని మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి.వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది? -
ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది.?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు...ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు దీనికేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు?. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వరుదు కళ్యాణి హెచ్చరించారు. -
‘భయంతో కారులోంచి బయటకు రాలేదు’
గుడివాడ: తనను టార్గెట్ చేసే టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు(శనివారం, జూలై 12) వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళుతున్న సమయంలో ఆమె కారును పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో భయపడిపోయి తన భర్త, తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోటీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు. కారును చుట్టుముట్టి..కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గంటకు పైగా ఆమె కారును కదలనీయకుండా నానా బీభత్సం సృష్టించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మహిళా జడ్పీ చైర్పర్సన్ పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ రకంగా దాడికి పాల్పడటం ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనడానికి నిదర్శమని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
జడ్పీ చైర్పర్సన్ హారిక కారుపై పచ్చమూకల దాడి
గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గంటకు పైగా కదలకుండా చుట్టుముట్టి..గుడివాడలో టీడీపీ, జనసేన గూండాల ఉన్మాద చర్యలకు పోలీసులు సహకరించారు. జడ్పీ చైర్ పర్సన్ హారిక కారును గంటకు పైగా కదలకుండా చేసినా పోలీసులు నామమాత్రంగానే వ్యవహరించారు. తన కారును చుట్టుముట్టినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంపై హారిక అసహనం వ్యక్తం చేశారు. .జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం పై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.