
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేవలం రెడ్‌బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం అని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ సైటెరికల్ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ప్పాల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై కేసు నమోదు చేయడం దారుణందాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త ఏం చేశారో.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. టీడీపీ మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆమె కొడాలి నాని.. ఫ్లెక్సీని చించేశారు. ఫ్లెక్సీని చించి చేతికి గాయం అయితే కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం.
చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. నారా లోకేశ్ డైరెక్షన్‌తో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు పంపింది టీడీపీ కార్యకర్తలు కాదా?. జెడ్పీ చైర్‌పర్సన్ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా?. వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కేసులు పెడుతున్నారు. 13 నెలలుగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టీడీపీ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు.