
సాక్షి, కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా?. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మీ అరాచకాలన్నీ గుర్తు పెట్టుకుంటాం.
ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది.
విడదల రజిని మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి.
వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది?