breaking news
incedents
-
ఏపీలో నారా సైకో పాలన సాగుతోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా?. చంద్రబాబు, పవన్కళ్యాణ్ మీ అరాచకాలన్నీ గుర్తు పెట్టుకుంటాం.ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది.విడదల రజిని మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి.వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది? -
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
పాక్ కాల్పుల్లో 7 నెలల్లో 52 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ఈ ఏడాది జూలై చివరి వరకు శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచార హక్కు చట్టం కింద కార్యకర్త రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. జనవరి నుంచి జూలై చివరి వరకు జరిగిన మొత్తం 1,435 కాల్పుల ఘటనల్లో 28 మంది పౌరులు, 12 మంది సైనిక సిబ్బంది, 12 బీఎస్ఎఫ్ జవాన్లు నేలకొరిగారని పేర్కొంది. దీంతోపాటు 140 మంది పౌరులు, 45 మంది సైనిక సిబ్బంది, 47 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపింది. మొత్తం 1,435 కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో ఎల్వోసీ వెంట 945, ఐబీ వెంట 490 ఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. -
శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
– పలువురికి గాయాలు – మునుగోడు మండలం కొంపెల్లిలో ఘటన కొంపెల్లి(మునుగోడు): గణేశ్ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొంపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గౌడ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే ఆ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లపై సౌండ్ సీస్టంమ్తో వేర్వేరుగా ఊరేగిస్తూ ఒక కాలనీలో ఎదురు పడ్డారు. మీరు పక్కకు తొలగాలంటే మీరని వాగ్వాదానికి దిగారు. అది తారస్థాయికి చేరుకోవడంతో ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. అయితే ఈ దాడుల్లో గౌడ సంఘానికి చెందిన వీరమళ్ల క్రాంతి కుమార్, పరమేష్, యాదవ సంఘంలోని జూకంటి శ్రీశైలం, దావ చంద్రమ్మ, దాం మహేష్, సైదులకు, అంజమ్మ, చంద్రమ్మకు తీవ్రమైన గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.