టీడీపీ కార్యకర్త డ్రామా.. ఉప్పాల హారిక భర్తపై కేసు నమోదు | Police Case Filed On ZP Chairman Uppala Harika Husband Ramu In Gudivada, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్త డ్రామా.. ఉప్పాల హారిక భర్తపై కేసు నమోదు

Jul 14 2025 11:57 AM | Updated on Jul 14 2025 1:22 PM

Gudiwada Police Case Filed On Uppala Harika Husband Ramu

సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి సర్కార్‌ వేధింపుల పర్వం కొనసాగుతోంది. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై గుడివాడ పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ నాయకురాలి ఫిర్యాదుతో ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి తర్వాత కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో, రంగంలోకి కూటమి పెద్దలు.. బాధితులను టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో కొత్త డ్రామాకు, డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపారు.

తాజాగా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి రివర్స్‌లో వారిపైనే కేసు పెట్టారు. పచ్చ బ్యాచ్‌ ప్లాన్‌లో భాగంగా హారిక భర్త రాము.. తన కాలుపై కారు ఎక్కించాడని టీడీపీ నాయకురాలు మాదాల సునీత ఆరోపించారు. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతల సాయంతో సునీత.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాముతో సహా నందివాడ మండలం వైఎస్సార్‌సీపీ నేత కందుల నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు. అయితే, జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై దాడి ఘటనలో మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్‌ చేయకపోవడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement