
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో మరో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కందనాతి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. రథం పక్కకి ఒరగి మీద పడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరులో విజయదశమి మరుసటి రోజున రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చెన్నకేశవ స్వామి రథాన్ని కొండపైకి తీసుకెళ్తుండగా రథం ఒక్కసారిగా కిందకు ఒరిగి భక్తుల మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రథోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.