breaking news
chennakeshavaswami ustawalu
-
చెన్నకేశవ స్వామి రథోత్సవంలో అపశృతి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో మరో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కందనాతి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. రథం పక్కకి ఒరగి మీద పడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరులో విజయదశమి మరుసటి రోజున రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చెన్నకేశవ స్వామి రథాన్ని కొండపైకి తీసుకెళ్తుండగా రథం ఒక్కసారిగా కిందకు ఒరిగి భక్తుల మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రథోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. -
భక్తి పారవశ్యంతో ముళ్లకంపపై నుంచి దొర్లారు!
హనుమంతునిపాడు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లాలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా ఏటా జరిగే కంపకల్లి వేడుక వైభవంగా ముగిసింది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని చిన్నగొల్లపల్లిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కంపకల్లి నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అర్ధనగ్నంగా ముళ్లకంపపై నుంచి గోవింద నామస్మరణ చేస్తూ కిందకు దొర్లారు. 14 ఏళ్లలోపు పిల్లల్ని కంపకల్లిపై దొర్లించడాన్ని మానవహక్కుల కమిషన్ నేరంగా పరిగణించడంతో పిల్లల్ని కంపకల్లికి తాకించి తీసుకెళ్లారు. పాలెగాళ్లు కంపకల్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.