
భక్తి పారవశ్యంతో ముళ్లకంపపై నుంచి దొర్లారు!
ప్రకాశం జిల్లాలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా ఏటా జరిగే కంపకల్లి వేడుక వైభవంగా ముగిసింది.
హనుమంతునిపాడు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లాలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా ఏటా జరిగే కంపకల్లి వేడుక వైభవంగా ముగిసింది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని చిన్నగొల్లపల్లిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కంపకల్లి నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అర్ధనగ్నంగా ముళ్లకంపపై నుంచి గోవింద నామస్మరణ చేస్తూ కిందకు దొర్లారు.
14 ఏళ్లలోపు పిల్లల్ని కంపకల్లిపై దొర్లించడాన్ని మానవహక్కుల కమిషన్ నేరంగా పరిగణించడంతో పిల్లల్ని కంపకల్లికి తాకించి తీసుకెళ్లారు. పాలెగాళ్లు కంపకల్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.