కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్‌ వ్యాఖ్యలు | CP VC Sajjanar Sensational Comments On Kurnool Bus Fire Accident | Sakshi
Sakshi News home page

కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్‌ సంచలన వ్యాఖ్యలు

Oct 26 2025 1:06 PM | Updated on Oct 26 2025 1:45 PM

CP VC Sajjanar Sensational Comments On Kurnool Bus Fire Accident

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.

సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement