
సాక్షి,కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు సత్తా చాటారు. దీంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
నేడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి పోటీ లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలే ఏక గ్రీవమయ్యారు. ఓటమి భయంతో టీడీపీ కార్పోరేటర్లు పోటీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాని రెండవసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.