breaking news
Korean girls
-
కొరియా అమ్మాయి.. విశాఖ అబ్బాయి.. కల్యాణం
కోనసీమ: విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార వ్యవహారాలకు వారధులుగా వారిద్దరూ సత్యదేవుని సాక్షిగా మనువాడారు. దేవస్థానంలో దక్షిణ కొరియాకు చెందిన జియోన్, విశాఖపట్టణానికి చెందిన ఎన్.కృష్ణ దీపక్ శనివారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం ఆదివారం సత్యదేవుని వ్రతమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వ్రత పురోహితుడు మంధా కారుణ్య ఆంగ్లంలో వ్రత కథ వివరించి వారితో చేయించారు. అనంతరం వధువు జియోన్ మాట్లాడుతూ తనకు హిందూ సంస్కృతి, ఆచారాలు బాగా నచ్చాయని, సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దర్శనం, స్వామివారి వ్రతం బాగా జరిగాయని తెలిపారు. -
కొరియన్ అమ్మాయితో మహేశ్ మేనల్లుడి పెళ్లి సందడి (ఫొటోలు)
-
స్నేహానికి ‘హద్దు’లుండవ్..!
ఈ ఫొటోలో ప్రత్యేకతేముంది? ఇద్దరు కొరియా అమ్మాయిలు సెల్ఫీ దిగుతున్నారు.. అంతే కదా అనిపిస్తోంది కదూ. ఈ ఇద్దరిలో ఎరుపు, తెలుపు రంగు జెర్సీ ధరించిన అమ్మాయిది ఉత్తర కొరియా. మరొకరిది దక్షిణ కొరియా. ఇప్పుడర్థమైంది కదా అసలు విషయం. తమ రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం గురించి ఏమాత్రం ఆలోచించని ఈ అథ్లెట్లు ఒలింపిక్స్ విలేజ్లో ఇలా ఫొటో దిగి అసలు సిసలు స్నేహాన్ని లోకానికి చాటుకున్నారు. అయితే తన పక్క దేశం నీడను సైతం భరించలేని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడోనని ఆ ఫొటో చూసినవారే హడలిపోతున్నారు. గేమ్స్ అనంతరం ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని ఇప్పటికే సోషల్ మీడియాలో సానుభూతి కూడా వ్యక్తమవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


