
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.