
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సినీ నటుడు రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. మడకశిర మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి రోలర్ రఘు హాజరయ్యారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిసేందుకు రోలర్ రఘు మడకశిర వెళ్లారు. ఆయన్ను.. మడకశిర నగర పంచాయతీ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీసుకెళ్లారు.
మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై సినీ నటుడు రోలర్ రఘు కనిపించారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే అర్హులు. అయితే, యాక్టర్ రోలర్ రఘు హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను అభాసుపాలు చేస్తోందని పలువురు మండిపడుతున్నారు.