అసదుద్దీన్‌ నినాదాలతో లోక్‌సభలో దుమారం | Controversy Over Asaduddin Oath In Loksabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో ఎంపీల ప్రమాణాలు: వివాదాస్పదమైన అసద్‌ నినాదాలు

Jun 25 2024 3:38 PM | Updated on Jun 25 2024 4:57 PM

Controversy Over Asaduddin Oath In Loksabha

సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌​ ప్రమాణం దుమారం రేపింది. మంగళవారం(జూన్‌25) తెలంగాణ ఎంపీల ప్రమాణాల్లో భాగంగా అసదుద్దీన్‌ కూడా ప్రమాణం చేశారు.

ఈ ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్‌ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. జై తెంగాణ, జై భీమ్‌, జై పాలస్తీనా అని అసదుద్దీన్‌ నినదించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో  స్పందించిన ప్రొటెం స్పీకర్‌ మెహతాబ్‌ అసదుద్దీన్‌ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్‌ ప్రకటన అనంతరం వివాదం సద్దుమణిగింది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement