
70 hour work week remark hilarious video viral భారతీయు యువత వారానికి 70 గంటలు పని పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రాజేశాయి. కొంతమంది కంపెనీల ప్రతినిధులు, నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానంగా ఇండస్ట్రీలో మహిళా ఉద్యోగులపై వివక్షపై ఎక్కువ చర్చ నడిచింది. ఇంటా బయటా మహిళా ఉద్యోగుల పనిగంటలు, వారికి లభిస్తున్న గుర్తింపు, అందుతున్న వేతనం తదితర విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.
ఇన్ఫీ ‘సిస్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. 70-80-90 గంటలు పనిచేస్తున్నారు గృహిణులు దగ్గర మొదలు పెట్టి.. నారాయణ ..నారాయణ.. అంటూ ఇన్ఫో ‘సిస్’ మీకు ఇన్ఫో ఇస్తోంది బ్రో.. అంటూ తనదైన యాక్సెంట్‌తో సాగిన ఈ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. ఈ హిలేరియస్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్.. నిజం చెప్పారు. గృహిణులు 70 నుండి 80 గంటలు పని చేస్తారు.. లవ్ యూ ఫర్ అండర్ స్టాండింగ్ .. ఇన్ఫో ‘సిస్’ అని ఒక యూజర్ కమెంట్ చేశారు. ఇది నూటికి నూరు శాతం, ఈ వీడియోను ఇన్ఫీ మూర్తి అంకుల్ చూడాలి అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం
Info sis giving you info on 70 hour week! 😂😂 pic.twitter.com/rh6Jw1n2TD
— Harsh Goenka (@hvgoenka) November 6, 2023