మరో వివాదంలో బిగ్‌ బీ అమితాబ్‌: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం

Bollywood Megastar Amitabh Bachchan Receives Backlash on Flipkart Ad Irks Traders - Sakshi

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  మరోసారి యాడ్‌  వివాదంలో చిక్కుకున్నారు. బిగ్‌బీ నటించిన  తాజా ప్రకటన  ఒకటి వివాదాస్పద మైంది. ఫ్లిప్‌కార్ట్  ‘ది బిగ్ బిలియన్ డేస్’ కోసం ఇటీవల ఆయన చేసిన ప్రకటన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉందంటూ వ్యాపార సంఘం మండిపడింది. అంతేకాదు మోసపూరితంగా వినియోగదారులను ప్రభావితం చేస్తున్న ఈ యాడ్‌ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)  అమితాబ్ బచ్చన్‌కు లేఖ రాసింది. 

ఫ్లిప్‌కార్ట్‌  ఇటీవలి ప్రకటన చూసి చాలా నిరుత్సాహపడ్డాం. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేదిగా ఉన్న ఈ ప్రకటనను  తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సియాట్‌ లేఖ రాసింది.  దుకాణదారుల వద్ద డీల్‌లు , ఆఫర్‌లు అందుబాటులో లేవని, తద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే. ఏ కారణంతో అలాంటి మాటలు చెప్పారో  వివరించాలని కోరింది.అలాగే తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్‌లు లేదా ద్రవ్య లాభాల కోసం ప్రకటనలతో కస్టమర్‌లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మళ్లించడం మానుకోవాలంటూ అభ్యర్థించింది. మొబైల్‌ రీటైల్‌ అసోసియేషన్‌ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవైపు దుకాణదారుల జీవనోపాధిని అనైతికంగా ,అన్యాయంగా ప్రభావితం చేస్తూనే మరోవైపు కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నందున, ప్రకటనను ఉపసంహరించు కోవాలని  కోరింది. 

జాగో గ్రాహక్ జాగో నినాదానికి తూట్లు పొడుస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ యాడ్‌పై  CAIT , AIMRA డిమాండ్‌ను అమితాబ్‌ పట్టించుకోలేదంటూ సియాట్‌ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ  జోక్యాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు  దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ , లేదా బిగ్‌బీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ  చేయలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top