ఆ స్మార్ట్‌ఫోన్లంటే ప్రాణం!, నిమిషానికి ఎన్ని ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారంటే!

Amazon And Flipkart See Over 9 Crore Customer Visits Each In First 48 Hours Of Sale - Sakshi

భారత్‌లో రెండు ఈ -కామర్స్‌ సంస్థలు నువ్వా..నేనా..సై..అంటూ భారీ డిస్కౌంట్లతో కాలుదువ్వుతున్నాయి. దీన్ని అదునుగా భావిస్తున్న కోట్లాది మంది కస్టమర్లు కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో సెకన్ల వ్యవధిలో తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్లు పెడుతున్నారు. ఆర్డర్లు సంగతి సరే. ఇంతకీ అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ పోర్టల్‌లో ఏ వస్తువు ఎక్కువగా  అమ్ముడవుతుంది? యూజర్లు ఏ బ్రాండ్‌ ఫోన్‌లు ఎక్కువగా కొంటున్నారు?   

దేశీయ ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ నిర్వహిస్తున్న ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్స్‌, అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ సేల్స్‌లో సరికొత్త రికార్డ్‌లను నమోదు అవుతున్నాయి. స్పెషల్‌ సేల్‌లో భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ అందిస్తుండడంతో అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ సైట్లకు  కస్టమర్లు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్‌లలోని వస్తువులు నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.  

ఫ్లిప్‌కార్ట్‌లో రోజుకి 9.1 కోట్ల మంది కస్టమర్లు  
కొనుగోలు దారుల డిమాండ్‌ దృష్ట్యా ఫ్లిప్‌ కార్ట్‌ వెబ్‌సైట్‌ను రోజువారీ లావాదేవీలపై 9.1 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు. ఆర్డర్లు సైతం 7 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ప్రత్యేక సేల్‌లో కొనుగోలు దారులు మొబైల్‌, గృహోపకరణాలు (Appliance), లైఫ్‌స్టైల్‌, బ్యూటీ అండ్‌ జనరల్‌ మెర్చెండైజ్‌ ఉత్పత్తులు అంటే షూ’లు, దుస్తులు,ఫార్మాస్యూటికల్‌ ప్రొడక్ట్స్‌, జ్యువెలరీ, ఫుడ్‌ ఐటమ్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

ఫ్లిప్‌ కార్ట్‌లో టైర్‌-2 ప్లస్‌ కస్టమర్లు రూ.20,000 ధర కంటే ఎక్కువగా ఉన్న ఫోన్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. 

ఇక, అదే సైట్‌లో 1-2 అండ్‌ 3 టైర్‌ సిటీస్‌కు చెందిన కస్టమర్లు మొబైల్స్‌, అప్లయెన్సెస్‌, లైఫ్‌ స్టైల్‌, బ్యూటీ అండ్‌ జనరల్‌ మెర్చెండైజ్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు 60 శాతం ఆర్డర్లు పెట్టారు. 

అమెజాన్‌లో 9. కోట్ల మంది
మరోవైపు అమెజాన్‌ అక్టోబర్‌ 8 నుంచి అక్టోబర్‌ 15 వరకు కొనసాగుతున్న అమ్మకాలు సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ మొదటి 48 గంటల్లో 9.5 కోట్ల మంది కస్టమర్లు అమెజాన్‌ సైట్‌ని వీక్షించారు. 

ఆఫోన్‌ అంటే మాకు ప్రాణం.. నిమిషానికి 100 ఆర్డర్లు
అమెజాన్‌ పోర్టల్‌లో ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లలో స్మార్ట్‌ ఫోన్‌లు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ కస్టమర్ల కంటే ముందే ప్రైమ్‌ సబ్‌స్క్రైబర‍్లు అక్టోబర్‌ 7న కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్కరోజే ప్రైమ్‌ మెంబర్లు సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్‌ ఫోన్‌ల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టారు. ఆ ఫోన్‌లలో వన్‌ప్లస్‌, శామ్‌ సంగ్‌, యాపిల్ ఐఫోన్‌లు ఎక్కువగా ఉండగా.. తొలి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 వన్‌ ప్లస్‌ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లలో శాంసంగ్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 

75 శాతం స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 
2-3 టైర్‌ (సిటీస్/టౌన్‌ల) ప్రాంతాల కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా 75 శాతం స్మార్ట్‌ఫోన్‌లు అమ్మినట్లు అమెజాన్‌ తెలిపింది. బడ్జెట్‌ ధర, నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ సౌకర్యం ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్‌ 3 శాతం వృద్ది సాధించినట్లు వెల్లడించింది. 

నిమిషానికో టీవీ
తాము నిర్వహిస్తున్న అమ్మకాల తొలి రెండ్రోజుల్లో ప్రతి సెకనుకు 1.2లక్షల కస్టమర్లు గృహోపకరకాణాల్ని కొనుగోలు చేశారు. ఆ సెకనులోని సగం మంది కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్న అప్లయెన్సెస్‌ కోసం ఆర్డర్‌ పెట్టారు. 2-3 టైర్‌ నగరాల ప్రజలు ప్రతి నిమిషానికి ఒక టీవిని కొనుగోలు చేశారు.  

అందం మీద ఆసక్తితో
ఫ్లిప్‌ కార్ట్‌, అమెజాన్‌ స్పెషల్‌ సేల్‌పై ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ ఓ ఆసక్తిరమైన రిపోర్ట్‌ను విడుదల చేసింది. బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో ఒకరోజు ముందే షాపింగ్‌ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లిప్‌ కార్ట్‌ ఫ్లస్‌ సబ్‌స్క్రైబర్లు  గ్రూమింగ్‌ సంబంధిత ప్రొడక్ట్‌లతో పాటు ఫుడ్‌ అండ్‌ న్యూట్రీషియన్‌, మేకప్‌, స్ప్రే బాటిల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు రెడ్‌రీస్‌ నివేదించింది

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 
గత ఏడాదిలో అమెజాన్‌ నిర్వహించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో తొలి 48 గంటల్లో 35శాతం కంటే ఎక్కువగా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను విక్రయించగా.. ప్రతి నిమిషానికి 10 ప్రీమియం నాయిస్‌ క్యాన్సిలింగ్‌ హెడ్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. 

ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ ఆర్డర్లు   
ఫ్లిప్‌కార్ట్‌లో బెంగళూరు,ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాల నుంచి ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై,పూణే, అహ్మదాబాద్‌,కోల్‌కతా, చెన్నై, గూర్‌ గావ్‌ నుంచి ఉన్నారు. ఆసక్తికరంగా ఫెస్టివల్‌ సీజన్‌లో షాపింగ్‌ ఎక్కువ చేసిన ప్రధాన నగరాల జాబితాలో హిసార్,లక్నో, పాట్నాలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top