భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్‌ నెట్‌వర్త్‌, లగ్జరీ కార్లు | Do you know Parineeti Chopra Net Wort h120 Times Richer check her luxury cars | Sakshi
Sakshi News home page

భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్‌ నెట్‌వర్త్‌, లగ్జరీ కార్లు

Sep 29 2023 12:47 PM | Updated on Sep 29 2023 1:29 PM

Do you know Parineeti Chopra Net Wort h120 Times Richer check her luxury cars - Sakshi

Pari-Raghav Chadha Networth బాలీవుడ్‌ నటి  పరిణీతి చోప్రా,  ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా  ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్‌ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్‌లో లేటెస్ట్‌ బజ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్‌బర్డ్స​ పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్‌లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి  నెట్‌వర్త్‌ 120 రెట్లు ఎక్కువ అని టాక్‌. 

2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ద్వారా  కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్‌ చేస్తే,  భర్త రాఘవ్‌  స్విఫ్ట్ డిజైర్‌ను నడుపుతాడు అంటూ సోషల్‌ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి)

పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్‌స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్‌ పరిణీతి సొంతం.  అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర  సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్‌లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్‌ కొత్త నిబంధనలు తెలుసా?)

లగ్జరీ  కార్లు
పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి  సొంతం. ఇంకా  43.19 లక్షల విలువైన ఆడి క్యూ4,  రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి  కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్‌లు  స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. 

బ్రాండెడ్‌ బ్యాగ్స్‌, షూ ఫ్యాన్
2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్‌తో కనిపించింది .అలాగే ఒక  ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ  దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా.  జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా  వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్‌లంటే మోజు. 

నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా.  ప్లేబ్యాక్ సింగర్‌గా  ఐకానిక్  సాంగ్‌ బతెరి మిట్టి మహిళా వెర్షన్‌తో ఎంత పాపులర్‌ అయిందో  తెలిసిందే.  ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని  చూపించింది ఇషాక్‌జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్‌మాల్ ఎగైన్ (2017) బ్లాక్‌బస్టర్ హిట్‌మూవీల్లో నటించిన  పరిణీతి మిషన్ రాణిగంజ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్‌కిలా’లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి చమ్కిలా లో యాక్ట్‌  చేసింది. 

రిచ్‌ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి
పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది.  తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్‌లో భారతీయ సైన్యానికి  డీలర్ కూడా  తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్‌లో,  UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్‌లో  బి.ఎ.  హానర్స్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌కు PRగా తన వృత్తిని ప్రారంభించింది.

రాఘవ్‌ చద్దా నికర విలువ
రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా  పాపులర్‌అయిన ఈ ఆప్‌ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు.  నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్‌ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్‌ కారు.
 

Advertisement
 
Advertisement
Advertisement