టెలికం రంగంలో ఎయిర్‌టెల్‌ జోరు! | Airtel Leads in New Subscribers in July Adds 2 68 Million Dollar Users | Sakshi
Sakshi News home page

టెలికం రంగంలో ఎయిర్‌టెల్‌ జోరు!

Aug 29 2026 4:51 AM | Updated on Aug 29 2026 4:51 AM

Airtel Leads in New Subscribers in July Adds 2 68 Million Dollar Users

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ జూలైలో అత్యధికంగా కొత్త యూజర్లను దక్కించుకుంది. గత నెల కంపెనీ కనెక్షన్ల సంఖ్య నికరంగా 26.8 లక్షలు పెరిగింది. మరో అగ్రగామి రిలయన్స్‌ జియో కొత్త యూజర్లు 24.4 లక్షల మేర పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం జూలైలో భారతి ఎయిర్‌టెల్‌ వైర్‌లెస్‌ యూజర్ల సంఖ్య 48.94 కోట్లకు, జియో సబ్ర్‌స్కయిబర్స్‌ సంఖ్య 50.60 కోట్లకు చేరింది.

వొడాఫోన్‌ ఐడియా మొబైల్‌ యూజర్లు 2.4 లక్షలు పెరిగి మొత్తం 19.90 కోట్లకు చేరారు. అటు ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్లు కూడా 1.68 లక్షల మేర పెరిగాయి. కొత్తగా 55.38 లక్షల మొబైల్‌ యూజర్ల చేరికతో దేశీయంగా వైర్‌లెస్‌ సబ్‌్రస్కయిబర్స్‌ సంఖ్య 128.79 కోట్లకు చేరింది. అంతక్రితం నెల ఇది 128.23 కోట్లుగా నమోదైంది. 1,562 ఆపరేటర్ల నుంచి లభించిన వివరాల ప్రకారం  మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌్రస్కయిబర్స్‌ సంఖ్య జూన్‌ ఆఖరు నాటికి 108.75 కోట్లుగా ఉండగా జూలై చివరికి 109.44 కోట్లకు పెరిగిందని ట్రాయ్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement