జియో, ఎయిర్‌టెల్‌ రీచార్జ్‌ ప్లాన్లు.. చౌకగా ఏడాది వ్యాలిడిటీ! | Jio vs Airtel Voice-Only Plans one year validity Compared | Sakshi
Sakshi News home page

జియో, ఎయిర్‌టెల్‌ రీచార్జ్‌ ప్లాన్లు.. చౌకగా ఏడాది వ్యాలిడిటీ!

Aug 28 2026 10:11 PM | Updated on Aug 29 2026 2:55 PM

Jio vs Airtel Voice-Only Plans one year validity Compared

మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డేటా అవసరం లేని వినియోగదారులకు టెలికాం కంపెనీలు ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు మాత్రమే అవసరమయ్యే వారు డేటా కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాన్లను వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ వేర్వేరు ధరలతో వాయిస్‌-ఓన్లీ ప్లాన్లను అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్‌ రూ.1,849 ప్లాన్‌

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,849 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 3,600 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ ప్లాన్‌లో  డేటా ప్రయోజనం లేదు. అలాగే అదనపు ప్రయోజనాలను కంపెనీ అందించడం లేదు. రోజువారీ ఖర్చును లెక్కిస్తే సుమారు రూ.5.07 అవుతుంది.

జియో రూ.1,748 ప్లాన్‌

రిలయన్స్‌ జియో అందిస్తున్న రూ.1,748 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తో పాటు మొత్తం 3,600 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో డేటా ప్రయోజనం ఉండదు. అంటే ఇంటర్నెట్‌ డేటా అవసరం లేని వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌ను రోజువారీ ప్రాతిపదికన చూస్తే సగటున సుమారు రూ.5.20 ఖర్చవుతుంది. అదనంగా జియో టీవీ, జియో ఏఐ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

ఏది బెస్ట్‌?

వ్యాలిడిటీ పరంగా చూస్తే ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ 365 రోజుల పాటు సేవలు అందిస్తుండగా, జియో ప్లాన్‌ 336 రోజులకే పరిమితమవుతుంది. అయితే జియో ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు, రోజువారీ ఖర్చు పరంగా ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ స్వల్పంగా చౌకగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవారు ఎయిర్‌టెల్‌ను, అదనపు డిజిటల్‌ ప్రయోజనాలు కోరుకునేవారు జియోను పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: జియో రీచార్జ్‌ ప్లాన్‌: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement