‘ఓయో’ ఆదాయం జంప్‌.. నాలుగు రెట్లు లాభం | OYO IPO Prism Reports 4X Profit Surge Revenue Jumps 50 percent | Sakshi
Sakshi News home page

‘ఓయో’ ఆదాయం జంప్‌.. నాలుగు రెట్లు లాభం

Aug 28 2026 9:57 PM | Updated on Aug 28 2026 9:59 PM

OYO IPO Prism Reports 4X Profit Surge Revenue Jumps 50 percent

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ప్రిజమ్‌ గత ఆర్థిక సంవత్సర(2025–26) ఫలితాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది(2024–25)తో పోలిస్తే కన్సాలిడేటెడ్‌ ఆదాయం 50 శాతం జంప్‌చేసి రూ. 9,358 కోట్లను తాకింది. ఓయో బ్రాండుతో ఆతిథ్య రంగ సేవలందించే కంపెనీ నికర లాభం మరింత అధికంగా నాలుగు రెట్లు ఎగసి రూ. 994 కోట్లకు చేరింది.

నిర్వహణ లాభం(ఇబిటా) రెట్టింపై రూ. 2,594 కోట్లను తాకింది. 2025–26లో రూ. 245 కోట్ల నికర లాభంమాత్రమే ప్రకటించింది. అయితే గతేడాది నికర లాభాల్లో రూ. 678 కోట్లమేర పన్ను లాభం(డిఫర్డ్‌ ట్యాక్స్‌) కలసి ఉంది. కాగా.. రుణాలపై రూ. 1,414 కోట్ల వడ్డీ చెల్లించినట్లు వార్షిక నివేదిక పేర్కొంది.

వెరసి ఐపీవో నిధులను కంపెనీ ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి జూన్‌లో దాఖలు చేసిన అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 6,650 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement