కూకట్‌పల్లి ఓయో హోటళ్లలో వ్యభిచారం | Prostitution Racket Busted in Kukatpally OYO | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి ఓయో హోటళ్లలో వ్యభిచారం

Aug 20 2026 11:10 AM | Updated on Aug 20 2026 11:16 AM

Prostitution Racket Busted in Kukatpally OYO

హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచార కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బాలానగర్‌ ఏసీపీ నరేష్‌ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. భాగ్యనగర్‌ కాలనీలోని అల్లూరి ట్రేడ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న సాయి ప్యారడైజ్, వైసాయి కాటేజ్‌ ఓయో హోటళ్లలో  గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో సీఐ స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రాత్రి ఈ దాడులు చేపట్టారు. 

ఈ ఘటనలో నిర్వాహకులు  ఆమని (28), దినేష్‌ (21),  రాజేష్‌ (28), ఉమేష్‌ చంద్ర (24), రామసాయి (25), విటులు రాజు (26), బాలరాజు (27), వంశీ (38) ప్రశాంత్‌ (36)లను అరెస్టు చేశారు. ముగ్గురు బాధితురాళ్లను రెస్క్యూ హోంకు తరలించారు.   మరో ఇద్దరు నిర్వాహకులు పరారీలో ఉన్నారు.  హోటళ్ల అనుమతులు రద్దు చేసి సీజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement