తారుమారు బంగారం! గంటల్లో మారిపోయిన ధరలు | Gold Rate Today Reversal Gold Prices Rise Hyderabad India | Sakshi
Sakshi News home page

తారుమారు బంగారం! గంటల్లో మారిపోయిన ధరలు

Aug 28 2026 8:48 PM | Updated on Aug 28 2026 9:01 PM

Gold Rate Today Reversal Gold Prices Rise Hyderabad India

దేశంలో బంగారం ధరలు నేడు (Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఉదయం భారీగా పడిపోయిన పసిడి ధరలు గంటల వ్యవధిలో తారుమారయ్యాయి. సాయంత్రానికే పెరుగుదల బాట పట్టాయి. దీంతో పుత్తడి ప్రియులకు అంతలనే తీవ్ర నిరాశ తప్పలేదు.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు సహా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం తులం (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం రూ.2900 తగ్గి రూ.1,46,500 వద్ద ఉండగా సాయంత్రం తిరిగే సరికి రూ.1,47,700 వద్దకు చేరింది. అంటే రూ.3350 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ఉదయం రూ.3160 తగ్గి రూ.1,59,820 వద్ద ఉండగా సాయంత్రాని​కే రూ.3650 ఎగిసి రూ.1,61,130 లను తాకింది.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.1,61,460 వద్దకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.1,47,850, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,61,280 పలుకుతున్నాయి.

ఇక వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం వెండి ధర కేజీకి రూ.5000 తగ్గి రూ.2,60,000 వద్దకు చేరగా సాయంత్రానికి రూ.5000 పెరిగి మళ్లీ రూ.2,65,000 వద్దకే ఎగిసింది. ఢిల్లీలో వెండి ధర మాత్రం మారలేదు. ఈరోజు  ఉదయం రూ.5000 తగ్గి రూ.2,55,000 వద్దకు వచ్చిన కేజీ వెండి సాయంత్రానికీ అదే ధర కొనసాగింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement