స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ.. మంచి స్పీడ్‌తో పాటు తక్కువ ధరలో, ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటారు. భారత్‌లో 5జీ సేవలు అందిస్తున్న ప్రధాన టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ ముందున్నాయి. అయితే జియోలో రూ.198 ప్లాన్, ఎయిర్‌టెల్‌లో రూ.349 ప్లాన్ తీసుకుంటే ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది?, రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఇప్పుడు చూద్దాం.
జియో రూ.198 ప్లాన్
తక్కువ బడ్జెట్‌లో 5జీ కావాలనుకునే వారికి జియో రూ.198 ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్‌తో రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయి. ఎక్కువగా వీడియోలు చూసేవారు, సోషల్ మీడియా ఉపయోగించేవారు, భారీ ఫైళ్లను డౌన్‌లోడ్ చేసేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అదనంగా.. జియో టీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ ధర జిఓ కంటే ఎక్కువే, అయితే ఇందులో వ్యాలిడిటీ 28 రోజులు లభిస్తుంది. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే.. 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందుతోంది.
జియో, ఎయిర్‌టెల్ మధ్య తేడా!
రెండు ప్లాన్లను పరిశీలిస్తే.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జియో రూ.198 ప్లాన్ చౌకగా ఉండటంతో పాటు రోజువారీ డేటా కూడా ఎక్కువగా ఇస్తుంది. కానీ దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. అదే.. ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంది. అంటే జియో ప్లాన్‌తో పోలిస్తే రెట్టింపు కాలం రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అయితే రోజువారీ డేటా 1.5GB మాత్రమే.
మరి ఏ ప్లాన్ తీసుకోవాలి?
మీకు తక్కువ ధరలో 5జీ కావాలి, ఎక్కువగా 5జీ డేటా ఉపయోగించాలి అనుకుంటే.. జియో రూ.198 ప్లాన్ గురించి ఆలోచించవచ్చు. తక్కువ కాలానికి రీఛార్జ్ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చన్నమాట. అయితే 28 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ డేటా, అదనపు సబ్‌స్క్రిప్షన్లు కావాలంటే ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ మెరుగైన ఎంపిక అనే చెప్పాలి.


