EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్! | EPFO EEC 2026, Eligible Employees Can Enroll In EPF Until October 31st, Check Out Its Benefits And Rules | Sakshi
Sakshi News home page

EEC 2026: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

Aug 22 2026 7:00 PM | Updated on Aug 22 2026 7:48 PM

EPFO Enrolment Campaign 2026 Special Chance for Workers Left Out of PF Coverage

ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) చాలా అవసరం. ఎందుకంటే.. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ, ఉద్యోగి రిటైర్ అయినప్పుడు, లేదా అవసరమైన సమయంలో ఈ మొత్తం ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి రాకుండా ఉండిపోయారు. ఇలాంటి వారికి ఇప్పుడు EPFO ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. అదే ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026 (EEC 2026).

EEC 2026 ఉద్దేశం
గతంలో ఈపీఎఫ్ కవరేజీకి దూరంగా ఉన్న అర్హులైన ఉద్యోగులను తిరిగి ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. అంటే.. తమ సంస్థలో అర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్‌లో నమోదు కాని ఉద్యోగులు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎప్పటి వరకు అవకాశం
2026 జూన్ 29 నుంచి ఈ క్యాంపెయిన్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 31, 2026 వరకు అర్హత ఉన్న ఉద్యోగులను నమోదు చేసుకోవచ్చు. అయితే.. సంస్థలు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, తమ ఉద్యోగుల రికార్డులను ముందుగానే పరిశీలించుకోవాలని ఈపీఎఫ్ఓ సూచించింది.

ఎవరు అర్హులు?
ఈపీఎఫ్ పరిధిలోకి రావాల్సి ఉన్నప్పటికీ.. గతంలో నమోదు కాని ఉద్యోగులను ఈ క్యాంపెయిన్ ద్వారా చేర్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా.. యజమాని ఉద్యోగిని డిక్లేర్ చేసే తేదీకి ఆ ఉద్యోగి జీవించి ఉండటంతో పాటు, అదే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. అలాగే ఈఈసీ 2026 కింద నిర్దేశించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు ప్రయోజనం ఏమిటి?
ఒక ఉద్యోగి EPFలో చేరితే భవిష్యత్తు కోసం పొదుపు మాత్రమే కాకుండా, నిబంధనలకు అనుగుణంగా పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది.

ప్రతి ఉద్యోగి ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను రూపొందించాలి. ఆ తరువాత తరఫున ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లను ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ద్వారా చెల్లించాలి.

యజమానులు ఏం చేయాలి?
సంస్థలు ముందుగా తమ ఉద్యోగుల వివరాలను పరిశీలించాలి. ముఖ్యంగా గతంలో EPFలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని గుర్తించాలి. దీని కోసం ఉద్యోగుల జీతాల రికార్డులు, ఎంప్లాయ్‌మెంట్ వివరాలు, EPF రికార్డులను పరిశీలించడం అవసరం. అర్హత ఉన్న ఉద్యోగులు కనిపిస్తే EEC 2026 కింద అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.

ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement