జెట్‌ స్పీడ్‌తో జియో కొత్త వైఫై రౌటర్‌.. ధర ఎంతంటే.. | Jio AX3000 Universal Router Speed Features ISP Compatibility | Sakshi
Sakshi News home page

జెట్‌ స్పీడ్‌తో జియో కొత్త వైఫై రౌటర్‌.. ధర ఎంతంటే..

Aug 20 2026 12:55 PM | Updated on Aug 20 2026 12:57 PM

Jio AX3000 Universal Router Speed Features ISP Compatibility

దేశీయ టెలికాం రంగంలో సర్వీసులు అందిస్తున్న రిలయన్స్ జియో గృహ నెట్ వినియోగదారుల కోసం మరో కొత్త ప్రోడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 1,500 చదరపు అడుగుల వైశాల్యానికి నిరంతర హై-స్పీడ్ ఇంటర్‌నెట్‌ కవరేజ్‌ను అందించే సామర్థ్యంతో కొత్త ‘జియో AX3000 యూనివర్సల్ వైఫై రౌటర్’ను విపణిలోకి తెచ్చింది. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు.

వైఫై-6 సాంకేతికతతో మెరుపు వేగం

నేటి డిజిటల్ యుగంలో ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్, 4K/8K వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ సర్వసాధారణమయ్యాయి. అయితే, రౌటర్ల కవరేజ్ సరిగా లేకపోవడం, ఇంటి మూలల్లో డెడ్ జోన్లు(ఇంటర్‌నెట్‌ కవరేజ్‌ సరిగారాని ప్రదేశాలు) ఏర్పడటం వంటి సమస్యలు వినియోగదారులను వేధిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన జియో AX3000 రౌటర్ లేటెస్ట్ వైఫై-6 (Wi-Fi 6) సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ (2.4 GHz-5 GHz) కనెక్టివిటీని అందిస్తుంది. 5 GHz బ్యాండ్‌పై గరిష్టంగా 2,400 Mbps వరకు, అలాగే 2.4 GHz బ్యాండ్‌పై 600 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది.

యూనివర్సల్ సపోర్ట్

సాధారణంగా జియో అందించే రౌటర్లు కేవలం జియో నెట్‌వర్క్‌కే పరిమితమవుతాయి. కానీ ఈ కొత్త AX3000 మోడల్ యూనివర్సల్ రౌటర్ కావడం వల్ల ఎయిర్‌టెల్‌, యాక్ట్‌ ఫైబర్‌నెట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌.. వంటి ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌లతో కూడా ఇథర్‌నెట్‌ ద్వారా నేరుగా పనిచేస్తుంది. ఈ రౌటర్ జియో అధికారిక వెబ్‌సైట్, జియోమార్ట్, అమెజాన్, ప్రముఖ జియో రిటైల్ స్టోర్లలో లభ్యమవుతోంది.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement