సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 472.77 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 72,382.47 వద్ద, నిఫ్టీ 133.80 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 22,555.75 వద్ద నిలిచాయి.
నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వెల్స్‌పన్ లివింగ్ లిమిటెడ్, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్, స్వాన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: గోల్డ్ రేటు మళ్లీ పెరుగుతుందా?.. HSBC అంచనా ఇదే!


